ఇకపై పాస్ పోర్ట్ లో అడ్రస్ కనిపించదు!

Wednesday, May 23rd, 2018, 11:14:11 AM IST

రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రకరకాల నూతన విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పోర్ట్ లో ఇక పై చిరునామా ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యహావరల శాఖ చెపుతోంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న నెంబర్ సిరీస్ ముగియగానే ఈ పద్దతిని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే జారీ చేయబడ్డ పాస్ పోర్ట్ లకు ఈ పద్ధతి ఉండదని, ఇకపై కొత్తగా జరీ చేసేవి అలానే పాత స్థానంలో ఎవరైనా కొత్తవాటి పునురుద్ధరణకు అప్లై చేస్తే ఈ విధానంలోనే వారికి పాస్ పోర్ట్ అందించనున్నారు. ఇప్పటివరకు మనకు జారీ చేసే పాస్ పోర్ట్ లో చివరి పేజీలో అభ్యర్థి పేరు, చిరునామా, పాస్ పోర్ట్ సంఖ్యతో కూడా వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అంటే ఇవి ఇకపై ఒక బార్ కోడ్ రూపం లో దర్శమివ్వనున్నాయి.

పాస్ పోర్ట్ అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంచేందుకే ఈ రకమైన నూతన చర్యకు ఉపక్రమించినట్లు అధికారులు చెపుతున్నారు. ఇకపై పాస్ పోర్ట్ తీసుకుని ఎయిర్ పోర్ట్ కు వెళితే అక్కడ పాస్ పోర్ట్ లో వున్నా బార్ కోడ్ స్కాన్ చేయడం జరుగుతుంది. అక్కడి ఇమ్మిగ్రేషన్, మరియు ఇతర శాఖల అధికారులకు మాత్రమే మన వివరాలు తెలుస్తాయి. మరొక విషయం ఏమిటంటే మరికొద్ది రోజులల్లో పాస్ పోర్ట్ ను అడ్రస్ ప్రూఫ్ జాబితా నుండి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఇకపై మనం అడ్రస్ ప్రూఫ్ కింద పాస్ పోర్ట్ ని చూపించేందుకు వీలు లేదు. ఇప్పటికే దేశం మొత్తం ఆధార్ తోనే దాదాపుగా అన్ని ప్రభుత్వ సేవలు నడుస్తుండడంతో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం…..

  •  
  •  
  •  
  •  

Comments