ఒకప్పుడు గొప్పనేతలు నడిపిన పార్టీ నేడు నీచ రాజీకీయాలు చేస్తోంది : నారా లోకేష్

Tuesday, May 1st, 2018, 03:47:41 AM IST


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ నేడు తిరుపతిలో టీడీపీ ఏర్పాటు చేసిన ధర్మ పోరాట సభలో ప్రసంగించారు. తమ పార్టీ విలువలు నీతికి పెట్టింది పేరు అన్నారు. ఆనాడు మా తాతయ్య ఎన్టీఆర్ గారు పేదల కోసం పెట్టిన ఈ పార్టీని నేడు తన తండ్రి చంద్రబాబు కూడా పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. తన తాత, అలానే తండ్రికి చెడ్డపేరు తెచ్చేపనులు తాను ఏనాడు చేయలేదని, చేయనని అన్నారు. కొందరు కావాలనే తనపై కుట్రపన్ని నిందారోపణలు చేస్తున్నారని, ఒకవేళ తనమీద వేసే నిందలకు రుజువులు ఉంటే చూపించి మాట్లాడాలని సవాల్ విసిరారు.

తనకు ప్రస్తుతం 34 ఏళ్ళు అని, మరొక 40 ఏళ్లపాటు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. బిజెపి, వైసీపీలు ఎన్ని కుట్రలుపన్నినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒకనాడు ఏపీకి విభజన హామీలు, రాజధాని విషయంలో న్యాయం చేస్తారని ఆశించి బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు వారు మోసం చేసి తప్పించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అసలు బిజెపికి బలంలేదని, తమపార్టీ మిత్రత్వంతోనే గత ఎన్నికల్లో ఆ పార్టీనేతలు గెలిచారని అన్నారు. అంతేకాదు ఒకప్పుడు అద్వానీ, వాజ్పాయి వంటి గొప్పనేతలు నడిపిన బిజెపి పార్టీ నేడు అన్యాయం చేసేవారి నేతృత్వంలో నీచ రాజీకీయాలు చేస్తోందని విమర్శించారు. వైసిపి, బిజెపితో లాలూచీపడి రహస్య పొత్తు పెట్టుకుందని, జగన్ కు దమ్ముంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోడీని ప్రశ్నించాలని ఆయన మండిపడ్డారు…..

  •  
  •  
  •  
  •  

Comments