ఆ విషయంలో రాహుల్..ధోనీనే ఫాలో అవుతున్నట్టున్నాడు.?

Wednesday, November 7th, 2018, 07:22:16 PM IST

నిన్న భారత్ మరియు విండీస్ మధ్య లక్నోలో జరిగినటువంటి టీ 20 మ్యాచ్ భారీ పరుగుల తేడా తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసినదే.భారత్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్లు మరో సారి చేతులెత్తేశారు.నిర్ణీత ఓవర్లలో రోహిత్ సేన విండీస్ ముందు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని పెడితే కరేబియన్స్ 124 పరుగులు మాత్రమే చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయారు.నిన్న జరిగినటువంటి మ్యాచులో రోహిత్ యొక్క వీరోచిత పోరాటం ధావన్ యొక్క దూకుడు,కే ఎల్ రాహుల్ యొక్క వేగవంతమైన ఆట భారీ లక్ష్యాన్ని అందించాయి,అయితే నిన్న కే ఎల్ రాహుల్ యొక్క ఆట తీరుని గమనిస్తే కెప్టెన్ కూల్ ఎం ఎస్ ధోనీని అనుకరిస్తున్నాడా అని అనుమానం రాకపోలేదు.

ధోని స్థాయి విధ్వంసకర షాట్లు కొట్టకపోయినా సరే స్ట్రెయిట్ లైన్ లో ఫోర్ బౌండ్రీ వైపు షాట్లు కొట్టిన తీరు గమనిస్తే ధోనీని అనుకరిస్తున్నాడనే చెప్పాలి.ఎందుకంటే ధోనీ కూడా సింపుల్ గా స్ట్రెయిట్ లైన్ లోనే ఎక్కువగా ఫోర్లు,సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరిగెత్తిస్తాడు,ఎందుకంటే మిగతా అన్ని వైపుల కంటే స్ట్రెయిట్ లైన్ లో మాత్రమే ఫీల్డర్లు తక్కువగా ఉంటారు,దానికి తోడు బంతి బ్యాట్ కు తగిలిన అతి కొద్ది సమయంలోనే బౌండరీని తాకుతుంది,ఇది ధోని యొక్క ప్లాన్ అదే ప్లాన్ ని ఇప్పుడు రాహుల్ కూడా ఫాలో అవుతున్నట్టు నిన్నటి మ్యాచ్ లో అతఃను ఆడిన తీరును గమనిస్తే అర్ధం అవుతుంది.