శ్రీరెడ్డి పక్కన ఫోటోలో వున్న ఆ మహిళ ఎవరు?

Tuesday, April 17th, 2018, 03:20:38 PM IST

శ్రీరెడ్డి, ప్రస్తుతం ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎంతో ఆవేదన అనుభవించానని, అంతే కాక తన వంటి ఆడవాళ్లు ఎంతో మంది ఆ విధంగా ఆవేదన అనుభవిస్తున్నారు. అలానే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి తో పాటు కొందరు కారెక్టర్ ఆర్టిస్టులు కూడా శ్రీరెడ్డి వాదనకు మద్దతిస్తుంటే, మరికొందరు మాత్రం అటువంటిది ఏమి లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి కి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శ్రీరెడ్డి తో పాటు ఒకమహిళ, అలానే ఆ మహిళతో కత్తి మహేష్ దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి.

మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఆ మహిళా ఏకంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఫోటోలు దిగడం. అసలు ఎవరు ఆ మహిళ, ఆమెకు శ్రీ రెడ్డికి ఏమిటి సంబంధం, అసలు కత్తి మహేష్ , ఆమె కలిసి ఎందుకు ఫోటోలు దిగారు అనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చేర్చే జరుగుతోంది. నిన్న శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణల వెనుక వైసిపి హస్తం ఉందని, శ్రీ రెడ్డి పక్కన వున్నది ఆ పార్టీకి చెందిన మహిళే అని కొందరు నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియవలసి వుంది……

  •  
  •  
  •  
  •  

Comments