ఆ విషయంలో గీత గోవిందం ఫస్ట్, రంగస్థలం నెక్స్ట్!

Monday, September 3rd, 2018, 08:49:14 PM IST

ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను, గీత గోవిందం, ఆర్ఎక్స్100 చిత్రాలు అని చెప్పుకోవాలి. అయితే అందులో నిర్మాతలకు ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిన వాటిలో ముందువరుసలో నిలిచేది గీత గోవిందం అని అంటున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. అయితే వారు చెపుతున్న లెక్కల ప్రకారం గీత గోవిందం చిత్రానికి రూ.14 కోట్లు పెట్టుబడి పెడితే ఆ చిత్రానికి రూ.100 కోట్లకుపైగా గ్రాస్ మరియు రూ.50 కోట్లకుపైగా షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత స్థానంలో నిలిచేది రంగస్థలం అట. ఆ చిత్రానికి రూ.70 కోట్ల పెట్టుబడి పెడితే, ఆ చిత్రానికి రూ. 225కోట్లు పైగా గ్రాస్, 123కోట్లకుపైగా షేర్ వసూలు చేసినట్లు చెపుతున్నారు.

ఇక ఆ తరువాతి స్థానంలో ఆర్ఎక్స్100 చిత్రం నిలుస్తుందట. ఆ చిత్రానికి రూ.3 కోట్ల పెట్టుబడి పెడితే రూ.15కోట్లవరకు కలెక్షన్ వచ్చిందని అంటున్నారు. ఇక మహానటి కూడా రూ.28 కోట్లవరకు ఖర్చుపెడితే, రూ.45 కొట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక చివరిగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం చోట్ల కొద్దిపాటి లాభాలు రాగా, మరికొన్ని చోట్ల కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే చేరుకుందని పై మూడు చిత్రాలకంటే ఎక్కువ లాభాలను ఆర్జించలేదు అనేది వారి మాట. ఇక ఈ మూడింటిలో రంగస్థలం చిత్రానికి కలెక్షన్లపరంగా మాత్రమేకాక శాటిలైట్ మరియు ఇతర హక్కుల నిమిత్తం మరింత లాభాలు వచ్చాయని, అయితే గీత గోవిందం మాత్రం శాటిలైట్ మరియు రీమేక్ హక్కుల విషయంలో కాస్త తక్కువ రాబట్టిందని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే నిర్మాత పెట్టిన డబ్బుల్లో దాదాపు మూడురెట్లకుపైగా ఆర్జించిన గీత గోవిందం అన్నిటికంటే ఈ ఏడాది నిర్మాత మరియు బయ్యర్లకు కాసులపంతా పండించిన చిత్రమని చెప్పుకోక తప్పదు మరి…..

  •  
  •  
  •  
  •  

Comments