గడిచిన 20 ఏళ్ళల్లో భారతదేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు నమోదు.!

Monday, October 1st, 2018, 06:10:27 PM IST

గత ఎన్నో ఏళ్లగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారే తప్ప అది ఇంకెప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుందో ఎవ్వరికి తెలీదు.అందరు నాయకులు ఎవరికీ వారు వారి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేశాం అన్ని ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంటారు.అన్ని రాష్ట్రాలు కలిపితేనే ఒక దేశం అవుతుంది,అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేసేయినట్టైతే దేశం మాత్రం ఎందుకు అభివృద్ధి చెందట్లేదో వాళ్లకే తెలియాలి.ఈ రోజుల్లో చేతిలో డిగ్రీ పట్టా పొందిన ప్రతీ భారతీయుడిని వెంటాడే సమస్య నిరుద్యోగం.

ఇప్పటికి మన దేశంలో 82%మగవారు 92%ఆడవారు నెలకు వారి కనీస జీతం పదివేల కంటే తక్కువే తీసుకుంటున్నారని ఇటీవలే ఒక వివేదికలో వెల్లడయ్యింది.గడిచిన ఇరవై ఏళ్ళల్లో భారతదేశం అత్యధిక నిరుద్యోగ రేటుని నమోదు చేసిన దేశంగా మిగిలిపోయింది.సెంట్రల్ పే కమీషను వారు ప్రతీ భారతీయుడి కనీస జీతం 18000 అని ప్రకటించించింది,ఇది చాలా మంది భారతీయులకు జీవన వేతనంగా పరిగణిస్తారు,దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో.ఆసిమ్ ప్రేమ్ జీ విశ్వ విద్యాలయం వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశమంతటా ఈ నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పాకుతుంది అని,ఈ నిరుద్యోగత ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉందని ఈ నివేదికలో వెల్లడయ్యింది.