వరుస గా 3 హిట్లు, వరుసగా 4 ప్లాపుల్లో ఆ హీరోయిన్ పరిస్థితి.

Saturday, October 6th, 2018, 07:16:08 PM IST

టాలీవుడ్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ ఎలా కలిసొస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి.ఇప్పటికే ఎంతో మంది హీరో, హీరోయిన్లు వచ్చారు కొంత మంది నిబడ్డారు,మరి కొంత మంది కనుమరుగయ్యిపోయారు.ఇప్పుడు ఈ రెండో కోవలోకి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఒక యంగ్ హీరోయిన్ వెళ్లిపోనుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆమె మెహ్రీన్ తన మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని అందుకొని ఆ తర్వాతి రెండు సినిమాల వరకు కూడా అదే హవా కొనసాగించింది.

తన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తన చక్కని ప్రతిభను కనబర్చి లక్కీ గర్ల్ అనిపించుకుంది.ఆ తరువాత వెంట వెంటనే మహానుభావుడు,రాజా ది గ్రేట్ వంటి మళ్ళీ హిట్ చిత్రాలతో అలరించింది.కానీ ఆ తర్వాత విడుదలైన ఒక్క సినిమా కూడ ప్రేక్షకులను అలరించలేదు.వరుసగా ఎలా విజయాలు అందుకుందో అంతే త్వరగా ప్లాపులను కూడా మెహ్రీన్ మూటగట్టుకుంది.c/o సూర్య,జవాన్ మరియు పంతం వరుస ప్లాప్ చిత్రాలను చవి చూసింది ఇప్పుడు కొత్తగా నోటా చిత్రం కూడా ఈ జాబితాలోకే చేరింది.ఇప్పుడు మెహ్రీన్ పరిస్థితి కాస్త దారుణంగానే ఉంది అని చెప్పాలి.

సినిమా హిట్ అయినా సరే ఛాన్సులు లేక ఎంతో మంది హీరోయిన్లు బాధ పడతారు కానీ మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి.కానీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. ఈ సారి నుంచి ఐనా కాస్త జాగ్రత్త వహించి తన చిత్రాలను ఎంచుకుంటే బెటర్..