వైఎస్ హయాంలో ఏపీకి ఎన్నోవస్తే, బాబు హయాంలో అన్ని పోతున్నాయి!

Tuesday, September 4th, 2018, 12:24:35 AM IST

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, ఒకవేళ తమకు అధికారాన్ని ఇస్తే ఎటువంటి కార్యక్రమాలు మరియు పధకాలు చేపడతామో అనే విషయాలను తెలుపుతూ తన ప్రజాసంకల్ప యాత్రను మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. ఓవైపు ఎండ మరోవైపు వానలు లెక్కచేయకుండా సాగుతున్న అయన దీక్ష ప్రస్తుతం విశాఖ జిల్లా కె కోటపాడు దానిచుట్టుప్రక్కల ప్రాంతాల్లో సాగుతోంది. అయితే ఆయన యాత్రలో టిడిపి ప్రతిభుత్వ విధానాలు మరియు సీఎం చంద్రబాబు పాలనపై కూడా విమర్శలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నేడు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్,

వైఎస్ హయాంలో కొన్ని వేల కోట్లరూపాయల మేర లాభాల్లో వున్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఇటీవల అధికారాన్ని చేపట్టిన మన చంద్రబాబు గారి చలువ వల్ల నలభై ఐదువేల కోట్ల మేర అప్పుల్లొకి కూరుకుపోయిందని అయన విమర్శించారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీపై దాదాపు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడం, వారి మోసపూరిత విధానాల కారణంగానే ఈ ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా బాబు గారు ఈ ఫ్యాక్టరీ పరిస్థితిని పట్టించుకుని కార్మికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు.

బాబు హయాంలో పలు ఫ్యాక్టరీలు, డైరీలు, పలు సంస్థలు మరియు కంపెనీలు మూతపడుతున్నాయని, రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానన్న ఆయన వాగ్దానాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేసారు. నాడు వైఎస్ హయాంలో రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి ఫలాలు, నూతన ఫ్యాక్టరీలు మరియు సంస్థలు వస్తే, నేడు చంద్రబాబు గారి హయాంలో వాటిని దోచుకోవడం, అన్ని సంస్థలు, ఫ్యాక్టరీలు నాశననమవడం జరుగుతోందని అన్నారు. బాబు గారి పాలనను ప్రజలు తిప్పి కొట్టే సమయం ఆసన్నమైందని, ఇప్పటికే రాష్ట్రంలోని చాల చోట్ల ప్రజలు టిడిపిని ద్వేషిస్తున్నారని, ఇక రాబోయే ఎన్నికల్లో వారికీ డిపాజిట్లు కూడాదక్కే పరిస్థితి లేదని అయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments