హెచ్‌1-బీ వీసా సమస్యలపై అమెరికాలో భారతీయుల ర్యాలీ!

Tuesday, March 20th, 2018, 05:36:58 PM IST

దేశాల వారీ కోటాను ఎత్తేయాలని అమెరికన్ భారతీయులు ఆయా ప్రాంతాల్లోని శాసనకర్తల మద్దతు కోరుతూ ర్యాలీలు చేశారు. హెచ్‌1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అర్కాన్సాస్‌, కెంటక్కీ, ఓరెగావ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దేశాల వారీ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అమెరికన్లకు, శాసనకర్తలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాలీ నిర్వహకులు తెలిపారు.

ఎప్పుడో లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నిబంధనను పెట్టారని, ఈ కాలానికి ఇది ఏమాత్రం అనువైనది కాదని అభిప్రాయపడ్డారు. లిండన్‌ జాన్సన్‌ 1963 నుంచి 1969వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. కెంటక్కీ లోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ర్యాలీలో దాదాపు 300మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశాల వారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి…..