బినామీ పేర్లు చెబితే కోటి రూపాయలు ఇస్తాం : ఆదాయపు పన్ను శాఖ

Friday, June 1st, 2018, 07:40:22 PM IST

ప్రస్తుతం నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఒక చోట నల్ల కుబేరులు బయటపడుతూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారులు కూడా అందులో ఉండడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అక్రమ సంపాదన లను కొంత మంది ఇతరుల పేర్ల మీద మెయింటైన్ చేస్తుండడం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నదే. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్రమ సంపాదనను బయట పెట్టడానికి ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. బినామీ పేర్ల మీద ఉన్న సంపద బయటకు రావాలని చేస్తున్న ఈ టార్గెట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో గాని కొందరికి మాత్రం బంపర్ అఫర్ దొరికినట్టే.

ఎందుకంటే.. బినామీదారులకు సంబందించిన కరెక్ట్ సమాచారాన్ని అందించిన వారికి కోటి రూపాయల అఫర్ ఇస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. బినామీ లావాదేవీల సమాచార రివార్డు పథకం 2018’ అనే పేరుతో ఈ మిషన్ ను స్టార్ట్ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. అదే విధంగా వివరాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు తాము ఎంత మాత్రం బయటకు చెప్పమని సీక్రెట్ గా ఉంటుందని పైగా భద్రత కూడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే సమాచారం ఇచ్చే వారు సరైన వివరాలు ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఒక ఫామ్ నింపి అందులో బినామీదారుడి గురించి క్లుప్తంగా పేర్కోవాల్సి ఉంటుంది. ఖచ్చితమైన కారణాలను కూడా అక్కడ తెలపాలని విదేశీయులకు కూడా ఈ అఫర్ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments