బిగ్ బ్రేకింగ్ టుడే.. వేకువ‌జామున ఉలిక్కిప‌డిన‌ విశాఖ.. ఐటీ శాఖ‌ దాడులు షురూ..!

Thursday, October 25th, 2018, 10:45:31 AM IST

ఏపీలోని విశాఖపట్నంలో ఐటీ దాడులు జ‌రుగ‌నున్నాయ‌నే వార్త‌లు రెండు మూడు రోజులుగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుండి దాదాపు 50 మందికి పైగానే ఐటీ అధికారులు విశాఖ చేరుకుని హోట‌ళ్ళో బ‌స‌చేశార‌ని బుధ‌వారం వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం విజ‌య‌వాడ‌లో కూడా ఐటీ దాడులు అంటూ నానా ర‌కాలుగా వార్త‌లు హ‌డావుడి చేసినా అక్క‌డ ఐటీ అధికారుల‌ ఉలుకూ ప‌లుకూ లేదు. దీంతో తాజాగా విశాఖ‌లో కూడా ఐటీ దాడులు అంటూ వార్త‌లు రావ‌డంతో చాలామంది లైట్ తీసుకున్నారు.

అయితే గురువారం ఉద‌యం నుండే విశాఖ‌ప‌ట్నంలో ఐటీ త‌న పంజాను విసిరి మెరుపు దాడులు ప్రారంభించిందని స‌మాచారం. అయితే ఈసారి ప్ర‌జాప్ర‌తినిధుల పై కాకుండా పారిశ్రామిక వేత్త‌ల పైనా సంస్థ‌ల పైన ఐటీ దాడులు మొద‌ల‌య్యాయ‌ని టాక్. ఈ క్ర‌మంలోనే విశాఖలోని దువ్వాడ ఎస్ఈజ‌డ్‌లో సోదాలు నిర్వహిస్తున్నారని స‌మాచారం. అంతే కాకుండా బీచ్ శాండ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ పైనా, ట్రాన్స్ వ‌రల్డ్ కార్యాల‌యంలోనూ.. ఎంవీపీ సెక్టార్‌లోని ఒక ఇంట్లో కూడా సోదాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఎనిమిది మందితో కూడిన బృందాలు ఉద‌యం నాలుగు గంట‌ల నుండే సోదాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఇక ఇదే క్ర‌మంలో మ‌రో రెండు మూడు జిల్లాల్లో కూడా సోదాలు జ‌రుగ‌నున్నాయని స‌మాచారం. ఏది ఏమైనా ఐటీ దాడులు ఏపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments