అసంబ్లీ సీట్ల పెంపు అదని ద్రాక్షేనా ?

Friday, January 12th, 2018, 10:38:41 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన, సీట్ల పెంపు అందని ద్రాక్ష గానే మిగలనుందని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కానీ అది ప్రస్తుతం అధికార టిడిపి కి అత్యంత ఆవశ్యకం, ఎందుకంటె ఇటీవల తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి, మరీ ముఖ్యంగా వై ఎస్ ఆర్ కాంగెర్స్ పార్టీ నుండి నేతలు చాలా వరకు వచ్చి చేరుతున్నారు. వారికి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపినట్లు, త్వరలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి, అందరికి తప్పక న్యాయం చేస్తానని అవకాశం వున్న మేరకు ప్రతి ఒక్కరికి సీట్ ఇప్పిస్తానని నమ్మబలికి పార్టీ లో చేర్చుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ వాదనకు మరింత బలం చేకూరేలా శుక్రవారం నాటి భేటీ విషయం లో బాబు ఇదే అంశంపై మోడీ ని కలుస్తున్నట్లు అంటున్నారు, కాని అది 2019 సాధారణ ఎన్నికలలోపు సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

వాస్తవానికి విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపుదల అంశం వుంది. అయితే అది ఇరు రాష్ట్రాల ఆస్తులు పంచినంత సులువుకాదని, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన విషయమని అంటున్నారు. పైగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ 2022 వరకు సాంకేతికంగా ఏ విధంగానూ కుదరదని మొదటి నుండి కేంద్రం వాదన. ఒక వేళ నిజంగా 2019 లోపు జరగకపోతే టిడిపి సంక్షోభంలో పడే అవకాశం కొంతవరకు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే కొత్తగా వచ్చి చేరిన నేతలకు, ఎప్పటినుండో పార్టీ ని నమ్ముకుని వున్న నేతలకు మధ్య బేదాభిప్రాయాలు వచ్చే అవకాశము లేకపోలేదు, వాటిని తీర్చి సర్దిచెప్పే నేర్పు, ఓర్పు చంద్రబాబుకు లేవని అంటున్నారు. సీట్ల సంఖ్య పెరిగితే అన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని భావించిన బాబు, అజెండా లో ప్రధానంగా ఈ అంశాన్నే పెట్టుకుని మోడీని కలుస్తున్నారని వారి మాటల సారాంశం. ఏది ఏమైనప్పటికి ఇది మాత్రం అంత సులువుగా తేలే విషయం కాదని, చంద్రబాబు కి టిడిపి కి రాబోవు కాలంలో కొంతమేర నిరుత్సాహం, సంక్షోభ నియోజకవర్గాల్లో తలనొప్పులు తప్పవు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments