లోన్లపై ఇన్ట్రెస్ట్ రేట్లను పెంచిన ఎస్‌బీఐ..! ఆందోళనలో ఖాతాదారులు…

Thursday, March 1st, 2018, 05:42:05 PM IST

అనుకున్నట్లుగానే కొంప ముంచేసింది. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తీస్కున్న రుణాలపై ఒక్కసారిగా వడ్డీ రేట్లను పెంచేసింది. ఇప్పటికే జీ.ఎస్.టీ అనీ ఇయర్లీ ట్యాక్స్ అని చాలా రకాలుగా వాసులు చేస్తున్న ఎస్‌బీఐ బ్యాంకు ఇప్పుడు ఏకంగా రుణాలపై ఫోకస్ చేసింది. డిపాజిట్ రేట్లను పెంచడంతో ఎస్.బీ.ఐ ఈ నిర్ణయానికి వచ్చింది.ఇప్పుడు ఉన్న నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 7.95శాతాన్ని 8.15శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ గురువారం ప్రకటించింది.. ఈ మేరకు బ్యాంక్‌ నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా.. 2016 ఏప్రిల్‌ తర్వాత ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి కావడం వాళ్ళ దీనికి అందరు కట్టుబడి ఉండాలని ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు సూచించారు.

అయితే తక్కువ మొత్తం, మరియూ అతి అక్కువ మొత్తం డిపాజిట్‌ రేట్లను 0.75శాతం పెంచుతున్నట్లు ఎస్‌బీఐ బుధవారం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. కాగా ప్రస్తుతం బ్యాంకు నిధుల వ్యయం ఆధారంగా రుణరేట్లను(ఎంసీఎల్‌ఆర్‌) నిర్ణయించడం జరుగుతుందన్నారు. అంటే బ్యాంకు నిధులు సమీకరించే వ్యయం(డిపాజిట్‌ రేట్లు) ఏ మాత్రం పెరిగినా.. ఆ ప్రభావం రుణరేట్లపై కూడా పడుతుందన్న విషయం తెలుసుకోవాలి. బుధవారం ఉదయం డిపాజిట్‌ రేట్లను పెంచడంతో తాజాగా రుణ రేట్లను కూడా పెంచింది ఖాతాదారులందరిని హడేలేత్తిస్తున్నది. అయితే ఇదంతా ఒకెత్తయితే ఎస్‌బీఐతో పాటు మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కూడా రుణ రేట్లను పెంచడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం ఉన్న 8.15శాతం నుంచి 8.30శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకులు పెంచిన రుణరేట్లు మార్చి 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి.