నరాలు తెగే ఉత్కంఠతో విజయాన్ని సొంతం చేసుకున్న భారత్..!

Tuesday, March 5th, 2019, 09:58:39 PM IST

నాగ్ పూర్ వేదికగా ఈ రోజు భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండ్ ఒన్డే మ్యాచ్ నిజాంగా నరాలు తెగే రీతిలో ఉత్కంఠ భరితంగా కొనసాగిందనే చెప్పాలి.మరో సారి కోహ్లీ వన్ మ్యాన్ షో తో అలాగే విజయ్ శంకర్ అద్భుతమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో ఎవరు ఊహించని విధంగా భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది.బ్యాటింగ్ లో విరాట్ మరియు విజయ్ శంకర్ లు మినహా మిగతా వారంతా చేతులెత్తేయడంతో ఆసీస్ కు 250 పరుగుల లక్ష్యాన్నే భారత్ ఉంచింది.దీనితో భారత్ అభిమానులు అందరు అందరు కాస్త అనుమానంగానే ఉన్నారు.


కానీ మన బౌలర్ల ధాటికి కంగారూలు ఖంగారు పడక తప్పలేదు..మార్కస్ స్టోయినీస్ 65 బంతుల్లో 52 పరుగులుతో చివరి వరకు పోరాడినా వీరికి ఓటమి తప్పలేదు.లక్ష్యం చూస్తే ఆసీస్ కు చిన్నదే కానీ బౌలర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేయడంతో కంగారులను 49.3 ఓవర్లలో 242 పరుగులకే కట్టడి చేసేసాం.ఈ రోజు ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్ శంకర్ కోసమే చెప్పాలి తాను పూర్తిగా రెండు ఓవర్లు కూడా వెయ్యకుండానే మ్యాచ్ అంతటిని మలుపు తిప్పేసాడు.

తాను వేసిన చివరి ఓవర్లో అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న స్టోయినీస్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ని మన వైపు తిప్పాడు కానీ ఇంకా ఒక వికెట్ మిగిలి ఉంది.రెండు జట్లకు 50-50 శాతం విజయ అవకాశాలు ఉంటే ఆసీస్ బౌలర్ జంపా 2 పరుగులు తీయగా ఇంకా 4 బంతులకి 8 పరుగులు కావాల్సి వచ్చింది ఆ సమయంలో శంకర్ వేసిన మూడో బాల్ నేరుగా మిడిల్ స్టంప్ కి తగలడంతో చాలా ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో మ్యాచ్ భారత్ సొంతం అయ్యింది.