నాలుగవ టెస్ట్ లో విరాట్ సేన ఓటమి!

Sunday, September 2nd, 2018, 10:46:57 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ టెస్ట్ సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తో ఇంగ్లాండ్ సిరీస్ ను దక్కించుకుంది. భారత బ్యాట్స్ మెన్లు అవసరమైన సమయంలోనే ఔటవ్వడంతో ఓటమిని చూడక తప్పలేదు. 245 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియా ఆదిలోనే తడబడింది. నాలుగవరోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా ఊహించని విధంగా 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే గట్టి దెబ్బ పడింది.

రాహుల్ డకౌట్ కాగా మరికొద్ది సేపటికే ఫామ్ లో ఉన్న పుజారా ఓపెనర్ ధావన్ అవుటయ్యారు. అనంతరం కోహ్లీ – రహానే క్రీజులో ఉండి అర్ధశతకాలతో గెలుపుపై నమ్మకాన్నీ పెంచారు. కానీ మొయిన్ అలీ ఫామ్ లోకి రావడంతో విరాట్(58) అవుటయ్యాడు. అనంతరం వరుసగా రహానే(51), పాండ్య(0) తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. ఇండియా 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ 60 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మెయిన్ అలీ నాలుగు వికెట్లు తీసి విజయంలో జట్టు కీలకపాత్ర పోషించాడు.

  •  
  •  
  •  
  •  

Comments