మార్పు రాకుంటే ఉద్యోగాలు పోతాయ్: అమెజాన్

Tuesday, April 3rd, 2018, 12:10:04 PM IST

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ ఎంత అవసరం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిజీ బిజీ లైఫ్ లో షాపింగ్ లకు వెళ్లే తీరిక లేక ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. ఒక్క ఫోన్ ఉంటె చాలు ఎలాంటి ఫోన్ అయినా తెల్లవారే సరికి రప్పించవచ్చు. అలాగే ఇతర అవసరమైన వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు. కొన్ని సంస్థలు వినియోగ దారులను ఆకట్టుకోవడానికి స్పెషల్ ఆఫర్స్ ని కూడా ఇస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇండియాలో ఫ్లిప్ కార్ట్, పేటీఎం, అమెజాన్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఈ సంస్థల వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పోటీ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరిగ్గా పని చేయని ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇటీవల అమేజాన్ ఇండియా 60 మంది ఉద్యోగులను తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది. భవిష్యత్తులో కూడా మరికొంత మందిని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొంత మందికి గడువును ఇచ్చి అప్పటి లోపు వృత్తిలో మార్పు రాకుంటే కంపెనీకి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని లేఖలు అందించినట్లు టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. మా ఉద్యోగులను చురుగ్గా ఉంచాలానే ఆలోచనతో అలాగే కంపెనీ గుర్తింపు కోసం ఈ విధంగా చేసినట్లు చెప్పారు. ఉద్యోగాలను కోల్పోయే వారికి ఇతర చోట అవకాశం కల్పిస్తామని యాజమాన్యం తెలియజేసింది.