షాక్ : ఇండియాకు పట్టిన ఆ దుస్థితి ఎయిడ్స్ కంటే ఘోరం..!

Friday, October 20th, 2017, 09:00:47 PM IST

తాజగా జరిగిన సర్వేలో భాగంగా ఇండియా లో కాలుష్యం గురించిన భయంకర నిజం బయటకు వచ్చింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే భారత దేశంలోని కాలుష్యం ఎయిడ్స్ వ్యాధికన్నా ఘోరమైనదని సర్వే నిపుణులు వెల్లడించారు. దానికి సంబందించిన చేదు నిజాల్ని లెక్కల రూపంలో వెల్లడించారు. కేవలం 2015 లో కాలుష్య సంబందించిన రోగాల వలన 25 లక్షల మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. కాలుష్య సంబంధిత మరణాల్లో భారత దేశం మొదటి స్థానంలో ఉంది.

ఎయిడ్స్, టిబి, మలేరియా వంటి రోగాల వలన చనిపోయిన వారికంటే 2015 లో కాలుష్యం వలన మరణించిన వారి సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 18 లక్షల మంది వాయు కాలుష్యం వలన మరణించగా, మరో 6.4 లక్షల మంది నీటి కాలుష్యం వలన మరణించారు. వాయుకాలుష్య మరణాలలో కూడా ఇండియన్ నెం వన్ గా ఉంది. కాలుష్యం బారిన పడి మరణిస్తున్న వారిలో ఇండియా – చైనా లోనే 50 శాతం మంది ఉన్నారు. ది లాన్సెట్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని చేసి ఇండియాని హెచ్చరించింది. కాలుష్య నివారణకు, పర్యావరణ సమతౌల్యానికి సరైన చర్యలు తీసుకోకుంటే ఇండియా ఎక్కువ ఆదాయాన్ని మెడికల్ ఖర్చులకే వెచ్చించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓపిరితిత్తుల సంబంధిత వ్యాధులు. డుండే సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.