భారత్ చాలా డేంజర్

Wednesday, February 18th, 2015, 09:42:26 PM IST


భారత్ తో మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్ళు జాగ్రత్తగా ఉండాలని… భారత్ చాలా ప్రమాదకరమైన జట్టు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. భారత్ లో ప్రపంచం గర్వించే స్థాయిలో ఉన్న ఆటగాళ్ళు ఉన్నారని ప్రపంచ కప్ గెలిచే సత్తా భారత్ కు ఉన్నదని రికిపాంటింగ్ స్పష్టం చేశారు. ఇక బారత్ బ్యాట్స్ మెన్ మ్యాచ్ పై కనుక పట్టు సాధిస్తే… వారిని నిలువరించడం కష్టమైన పని అని రికీ తెలిపారు. భారత ఆటగాళ్లను ఎదుర్కోవాలి అంటే ఎదురుదాడి ఒక్కటే మార్గమని…వీలైనంత త్వరగా బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పంపితేనే.. మ్యాచ్ గెలవగాలమని రికీ తెలియజేశారు. డిఫెండింగ్ చాపియన్ గా బరిలోకి దిగితున్న ఇండియాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయవద్దని రికీ పాంటింగ్ అన్నారు.