మన 500 మనదే..చారిత్రాత్మక టెస్టు లో భారత్ ఘన విజయం !

Monday, September 26th, 2016, 01:44:28 PM IST

team-india
చారిత్రాత్మక టెస్టుని టీం ఇండియా మరింత తీపి గుర్తుగా మలచుకుంది.500 వ టెస్ట్ లో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా ఘనవిజయం సొంతం చేసుకుంది.న్యూజిలాండ్ ను 197 పరుగులతేడాతో ఓడించింది.రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

చివరిరోజు కివీస్ డ్రాకోసం పోరాడినా స్పిన్నర్ అశ్విన్ ధాటికి నిలువలేక పోయింది.భారత బ్యాట్స్ మాన్ కివీస్ కు 434పరుగుల భారీ లక్ష్యాన్ని విధించగా కివీస్ 93/4 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించింది.చివరికి 236 పరుగులకె కివీస్ కుప్పకూలింది. రెండో టెస్ట్ శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ లో మొదలవుతుంది.కివిస్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్లు పడగొట్టగా రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి భారత విజయం లో కీలక పాత్ర పోషించారు.