వన్డే సీరీస్ భారత్ కైవసం

Sunday, July 28th, 2013, 07:15:06 PM IST

Indian-Cricket-Team
భారత్ – జింబాబ్వే మధ్య జరుగుతున్న 5 వన్డేల సీరీస్ లో భాగంగా ఈ రోజు మూడో వన్డేలో ఇరు జట్లు అమీ తుమీ తెచుకోవడానికి రంగంలోకి దిగాయి. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయి డీలా పడిపోయిన జింబాబ్వే ఈ సారి ఇండియాకి ఎలాగైనా కళ్ళెం వేయాలని రంగంలోకి దిగింది. మొదట టాస్ గెలిచినా ఇండియా ఫీల్డింగ్ ఎంచుకొని జింబాబ్వే టీం బ్యాటింగ్ చెయ్యడానికి పచ్చజెండా ఊపింది. బాగా కాన్ఫిడెంట్ గా గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన జింబాబ్వే ఓపెనర్స్ ఇద్దరూ 2 పరుగులకే అవుట్ అవ్వడంతో మిగతా వారు కాస్త తడబడుతూ ఆడారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ అందరూ పెద్దగా రాణించకపోవడం, అలాగే మన బౌలర్స్ ధాటికి తట్టుకోలేక వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. జింబాబ్వే టీం 46 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 183 పరుగులు చేసి 184 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. టీం ఇండియా నుంచి అమిత్ మిశ్రా 4 వికెట్లు తీసాడు.

తక్కువ టార్గెట్ ని దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగిన ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ఇద్దరూ నిధానంగా పరుగులను మొదలు పెట్టినా ఎక్కువసేపు గ్రీసులో ఉండలేక పోయారు. 27 పరుగుల వద్ద ఒకరు, 67 పరుగుల వద్ద ఒకరు ఇలా ఓపెనర్స్ ఇద్దరూ పెవిలియన్ బాట పట్టగా ఆ తర్వాత బరిలోకి వచ్చిన కోహ్లీ, రాయుడు నిలకడగా ఆడుతూ, జింబాబ్వే బౌలర్ల స్పీడుకు కాస్త బ్రేకులు వేసి ఇండియా స్కోర్ బోర్డ్ లో పరుగులు పెంచడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రాయుడు అవుట్ అయినా తర్వాత వచ్చిన రైనా కోహ్లీకి తోడవడంతో ఇద్దరూ కలిసి మూడో వన్డేలో టీం ఇండియా విజయ బావుట ఎగురవేసేలా చేసారు. ఇండియా 35.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇండియా కెప్టెన్ కోహ్లి 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మూడో వన్డే కూడా ఇండియా గెలవడంతో సీరీస్ ని 3-0 తో ఆధిక్యంలోకి వెళ్లి సీరీస్ నే కైవసం చేసుకుంది.