బిజీ బిజీగా విరాట్ సేన.. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న ధోని!

Monday, February 12th, 2018, 11:50:22 PM IST

రేపు జరగబోయే 5వ వన్డే కోసం భారత్ క్రికెట్ జట్టు చాలా కష్టపడుతోంది. ఎలాగైనా విజయం సాధించి వన్డే సిరీస్ ను గెలవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే సౌత్ ఆఫ్రికా కూడా ఎలాగైనా మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను భారత్ కి అందకుండా చేయాలనీ ఆలోచిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా భారత్ జట్టు పోర్ట్ ఎలిజ‌బెత్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ కి సంబందించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని కూడా బౌలర్లతో కలిసి బౌలింగ్ చేశాడు. ఇక ఆటగాళ్లందరూ ఎంతో ఇష్టపడే ఫుట్ బాల్ అటను కూడా చాలా సేపు ఆడారు. ఇకపోతే వాతావరణం ఓ విధంగా కలవరపెడుతోంది. దీంతో ఈ రోజు ఆలస్యంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. వరుసగా హ్యాట్రిక్ విజయాల తరువాత సఫారీలు నాలుగవ వన్డేలో గెలిచినా సంగతి తెలిసిందే. మరి రేపటి మ్యాచ్ లో మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments