ప్రపంచ శ్రీమంతుల్లో మూడవ స్థానంలో భారత్…

Friday, March 2nd, 2018, 11:40:16 PM IST

· మొత్తం భారతదేశంలో 131 మంది ధనవంతులు

· మొదటిస్థానంలో ముకేశ్ అంబానీ

రోజురోజుకీ ధనవంతుల జాబితా పెరిగిపోతుంది. ప్రపంచం మొత్తంలో చూస్కుంటే ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్నారు నూతన విశ్లేషక సమాచారం. అయితే గురువారం బయటకి వచ్చిన ‘హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2018’ ప్రకారం… ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల డాలర్లు (బిలియన్‌) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు 131 కి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది ఈ జాబితాలో చేరడం విశేశాత్మకం. స్టాక్‌ మార్కెట్లో ఈమధ్య అకస్మాత్తుగా పెరిగిన బూమ్‌ ఇందుకు ముఖ్య కారణం అయింది.

ఇండియాని నెంబర్‌ వన్‌ స్థానానికి తీస్కెళ్ళిన ముకేశ్‌ అంబానీ…

క్రిందటి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా 45 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.92 లక్షల కోట్లు) ఆస్తులతో ముకేశ్‌ అంబానీ అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ 14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,000 కోట్లు) ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ ఆస్తుల విలువ 73 శాతం, గౌతమ్‌ ఆదానీ ఆస్తుల విలువ 109 శాతం పెరిగాయి. అంటే ఈ సంవత్సరం భారతదేశం సంపన్నత శాతం సుమారు 200ల వరకు పెరగడం నిజంగా ఆశ్చర్యకరం. హురున్‌ సంపన్నుల జాబితా ప్రకారం… ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 19వ స్థానంలో, అదానీ 98వ స్థానంలో నిలిచారు. ప్రవాస భారతీయ సంపన్నులను కూడా కలుపుకుంటే ఈ జాబితాలోని భారత బిలియనీర్ల సంఖ్య ఏకంగా 170కి చేరుతుంది. దాదాపు 18 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్న ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌… ముకేశ్‌ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్నుడైన భారతీయుడం వేశేషాత్మకమైన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్వని వివిధ రంగాల వారీగా చూస్తే మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో 19 మంది ఫార్మా రంగానికి, 14 మంది ఆటోమొబైల్‌ రంగానికి, 11 మంది కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.

ప్రపంచ జిడిపిలో 13.2 శాతం భారత్ కైవసం

ప్రపంచంలోని 68 దేశాల్లో 100 కోట్ల డాలర్ల (బిలియన్‌ డాలర్లు)కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు 2,694 మంది, కంపెనీలు 2,157 ఉన్నాయి. అయితే వీరి సంపద మొత్తం విలువ 10.5 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.682.5 లక్షల కోట్లు). ప్రపంచ జిడిపిలో ఇది 13.2 శాతానికి సమానం. కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఈ కుబేరుల సంపద విలువ 31 శాతం పెరిగింది.

అమెరికాను అధిగమించి దూసుకుపోయిన చైనా

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నమొత్తం బిలియనీర్లలో 819 మంది కమ్యూనిస్టు చైనాలో ఉండగా, అమెరికాలో 571 మంది మాత్రమే ఉన్నారు. క్రిందటి సంవత్సరంతో పోల్చితే ఈ విషయంలో రెండు దేశాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల హవాతో ఈ సంవత్సరం చైనా ఈ విషయంలో అమెరికాను మించిపోయింది.

అమెజాన్‌ అధినేత అత్యంత ధనికుడు

ఇవన్ని ఇలాఉంటే ఈ సంవత్సరం 123 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తర్వాత 102 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో వారెన్‌ బఫెట్‌ రెండో స్థానంలో, 90 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ మూడో స్థానంలో, 79 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ నాలుగో స్థానంలో నిలిచారు.