ఫ్లాష్ : పాక్ కు భారత్ రిటన్ గిఫ్ట్..పాక్ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ !

Thursday, September 29th, 2016, 03:03:48 PM IST

india-army
యురి ఘటనకు ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి దాదాపు మూడు కిలోమీట్లర్ల మేర భారత సైన్యం దూసుకునికి పోయింది. పాక్ ఉగ్రవాద స్థావరాల పై భారత బలగాలు సర్జికల్ దాడులు నిర్వహించింది.సర్జికల్ దాడులంటే అనుకున్న ప్రదేశం పై క్రమబద్ధమైన దాడులని అర్థం. ఈ దాడుల్లో పాక్ ఉగ్రవాదులు దాదాపు 20 మంది మరణించి ఉంటారని అంచనా. జమ్మూకాశ్మిర్ లోని పాక్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు కొనసాగుతున్నాయని డిజిఎంఓ రవీర్ సింగ్ ప్రకటించారు. ఇటీవల కాలం లో పాక్ సైన్యం దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిందని అన్నారు.

నియంత్రణ రేఖ వద్ద గత రాత్రి దాడులు నిర్వహించాం.. వారికి ఇదో గుణపాఠం అని రణవీర్ సింగ్ ప్రకటించారు.ఈ రోజు సాయంత్రం ఈ సర్జికల్ దాడులపై అఖిల పక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దు రాష్టాల ప్రభుత్వాలకు ఫోన్ లో సమాచారం అందించారు. సరిహద్దుల్లోని దాదాపు 10 కిలోమీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు.సరిహద్దయాల్లోని దాడుల విషయం రణవీర్ సింగ్ ప్రధాని మోడీ తో చర్చించిన తరువాత ఆయన మీడియా లో ప్రకరటించారు.కాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత సైన్యం దాడుల్ని ఖండించారు. పాక్ ను రక్షించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపినట్లు పాక్ మీడియా తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments