కోహ్లీ సేన నెంబర్ 2 ర్యాంకును అందుకుంటుందా?

Tuesday, October 31st, 2017, 06:29:25 PM IST

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. న్యూజిలాండ్ తో గెలిచిన 2-1 సిరీస్ తో కలిపి వరుసగా ఇప్పటివరకు 7 వన్డే సిరీస్ లను దక్కించుకొంది. ప్రపంచం లోనే అన్ని జట్లకంటే భారత జట్టే స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే టెస్టుల్లో అగ్రస్థానంలో ఉండగా వన్డేల్లో కూడా నెంబర్ వన్ ర్యాంక్ తో ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా ఇండియాతో సమానంగా ఉంది. కానీ గత కొంత కాలంగా ఇండియా టీ20 లల్లో మాత్రం అంతగా రానించడం లేదు.

ప్రస్తుతం భారత జట్టు టీ20 లలో 116 రేటింగ్ తో 5వ స్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్ మాత్రం 125 రేటింగ్ తో మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ టెస్టుల్లో వన్డేలలో అంతగా రానించకపోయినా టీ20ల్లో మాత్రం గడిచిన 3 ఏళ్లలో మంచి ఆటతీరును కనబరిచింది. అయితే రేపు మొదటి స్థానంలో ఉన్న ఈ జట్టుని ఇండియా ఎదుర్కొనబోతోంది. మూడు టీ20 ల సిరీస్ లో రేపు రాత్రి 7 గంటలకు మొదటి మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ సిరీస్ ను గెలిస్తే భారత్ రెండవ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయం. మరి కోహ్లీ సేన ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.