ఇంగ్లాండ్ కు ధీటుగా నిలిచిన కోహ్లీ శ్రమ వృధా!

Saturday, August 4th, 2018, 05:44:12 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ పడిన కష్టమంతా వృధా అయిపొయింది. గెలుస్తుందన్న జట్టు ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ ధాటికి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. నాలుగవ రోజు స్టార్ట్ అయిన మ్యాచ్ లో 84 పరుగులు చేస్తే ఇండియా గెలుస్తుంది అనగా నిన్నటివరకు నిలకడగానే ఆడిన దినేష్ కార్తీక్ కొద్దిసేపటికే అవుటయ్యాడు.ఆ తరువాత కోహ్లీ కూడా వెనుతిరగడంతో మ్యాచ్ ఎండ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బెన్ స్టోక్స్ సరైన సమయంలో వికెట్లు తీయడంతో మ్యాచ్ పై ఇంగ్లాండ్ పట్టు సాధించింది.

194 పరుగులు టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా గెలవడం పెద్ద కష్టమేమి కాదని అంతా భావించారు. కానీ బెన్ స్టోక్స్ (4 వికెట్లు) జేమ్స్ ఆండర్సన్ మరియు బ్రాడ్ రెండేసి వికెట్లు పడగొట్టడంతో విజయం చేజారిపోయింది. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీకి ఏ ఆటగాడు సరైన మద్దతు ఇవ్వలేదు. చివరలో హార్దిక్ పాండ్యా ఉన్నాడనే దైర్యం కొంచెం ఉన్నప్పటికీ బ్రిటిష్ బౌలర్లకు పిచ్ బాగా అనుకూలించడంతో పాండ్యా కూడా ఏమి చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 149 పరుగులు చేయగా సెకండ్ ఇన్నింగ్స్ లో 51 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాట్స్ మెన్ లు ఎవరూ కూడా కనీసం మూడు పదుల స్కోరును కూడా ఈ మ్యాచ్ లో చేయకపోవడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments