కివీస్ దాటికి భారత్ క్లీన్ బౌల్డ్

Wednesday, February 6th, 2019, 05:30:37 PM IST


నేడు జరిగిన టీ20 మ్యాచ్ లో భారత ఆటగాళ్ల తీరు చాలా నిరాశపరిచింది. భారత్ చాలా దారుణమైన ఓటమిని చవిచూసింది. నేడు వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో కివీస్ ఆధిక్యం సాధించింది.