100లో టీమిండియానే బెస్ట్!

Friday, June 29th, 2018, 04:30:25 PM IST

గత కొంత కాలంగా భారత జట్టు అందుకుంటున్న విజయాలతో ఎదో ఒక రికార్డు బద్దలవుతోంది. రీసెంట్ గా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్నీ అందుకొని టీ20ల్లో 100 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన జట్టుగా నిలిచింది. ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఓపెనర్లు ఫార్మ్ లో ఉండడంతో రానున్న టోర్నీలకు కలిసొచ్చే అవకాశం. రోహిత్ శర్మ కోహ్లీ ధావన్ వంటి ఆటగాళ్లు చేసే భారీ స్కోర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇకపోతే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో 100 టీ20 మ్యాచ్ లు ఆడిన జట్టుగా ఏడవ స్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఇండియా మొత్తంగా 63 మ్యాచ్ లు గెలిచింది. ఈ రికార్డుతో మొదటి స్థానంలో ఎక్కువ విజయాల్ని అందుకున్న జట్టుగాను భారత్ నిలవడం ప్రశాంచాల్సిన విషయం. ఇప్పటివరకు 100 మ్యాచ్ లు ఆడిన జట్లు ఇండియా స్థాయిలో విజయాల్ని అందుకోలేదు. ఇక భారత్ తరువాత అత్యధికంగా విజయాలు అందుకున్న జట్లు ఈ విధంగా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా(59)
పాకిస్తాన్ (‌59)
ఆస్ట్రేలియా(53)
శ్రీలంక (52)
న్యూజిలాండ్‌(52)
ఇంగ్లండ్‌(48)