సఫారీ సక్సెస్ స్టేడియంలో కోహ్లీ సేన గెలుస్తుందా?

Monday, February 12th, 2018, 05:27:55 PM IST

టెస్ట్ సిరీస్ పరాజయంతో ఒక్కసారిగా వన్డేలో పుంజుకున్న కోహ్లీ సేన హైట్రిక్ విజయాలతో దూసుకుపోయింది. ఆరు వన్డేల సిరీస్ లో నాలుగవ వన్డే మాత్రం సౌత్ ఆఫ్రికా విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. రేపు జరగబోయే మ్యాచ్ పై కూడా సౌత్ ఆఫ్రికా విజయంపై కన్నేసింది. అందులోను లక్కీగా చెప్పుకునే వారి విన్నింగ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండడంతో సఫారీలకు కలిసొచ్చే అంశం అనిపిస్తోంది. ఎందుకంటే ఆ గ్రౌండ్ లో సఫారీలకు మంచి రికార్డ్ ఉంది. గత కొంత కాలంగా అపజయం అన్న మాట అక్కడ లేదు. ఆ మైదానమే పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్ పార్క్. అక్కడ 32 మ్యాచ్‌లలో సఫారీలు 20 గెలవగా 11 మ్యాచ్ లలో ఓడిపోయారు. ఒకటి మాత్రం రద్దు అయ్యింది. అయితే కోహ్లీ సేన ఇప్పటివరకు ఆడినది ఒక లెక్క ఇప్పుడు ఆడేది మరో లెక్క అనేలా పరిస్థితి మారింది. మరి రేపు అక్కడ గెలిచి ఇండియా జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments