క్రికెట్ ఫ్యాన్స్ ఈ రోజును మరచిపోగలరా?.. గెలుపుకు ఏడేళ్లు!

Monday, April 2nd, 2018, 01:51:09 PM IST

కొన్ని మధుర జ్ఞాపకాలను మర్చిపోవడం నిజంగా అసాధ్యమే. మనోలో మనమే ఆనందపడే విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరితో కలిసి ఎంజాయ్ చేసే ఆనందాలు కొన్నే ఉంటాయి. ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండరు. వయసుతో సంబంధం లేకుండా క్రికెట్ చూడటాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. అయితే ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఆనందపడిన రోజు అందరికి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ధోని న్యాయకత్వంలో ఇండియా ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది.

2011 ఏప్రిల్ 2న శ్రీలంకతో భారత్ ఆడిన ఫైనల్ మ్యాచ్ ను ఏ క్రికెట్ అభిమాని మరచిపోలేడు. సంబరాలు చేసుకొని ఇండియన్ లేడు. ఆ జ్ఞాపకాలు భారతదేశమంతా ఎన్నో వెలుగులు నింపాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు చాలా సంతోషంగా కలిసి ఎంజాయ్ చేశారు. ఇక మన మన క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 28 ఏళ్ల నుంచి ఉరిస్తోన్న ప్రపంచ కప్ చేతిలో పడటంతో జాతీయ జెండాను గ్రౌండ్ మొత్తం రెపరెపలాడేలా చేశారు. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొదటి వరల్డ్ కప్ అందుకున్న భారత్ మళ్లీ ఇన్నాళ్ళకి ధోని కెప్టెన్సీలో వచ్చింది. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు అది మరచిపోలేని ఒక మూమెంట్.

శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగి 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదట్లోనే తడబడింది. సెహ్వాగ్ – సచిన్ మొదట్లోనే అవుటయ్యాడు. ఇక ఆ తరువాత గంబీర్ కోహ్లీతో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తరువాత ధోని యువరాజ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ప్రపంచం మొత్తం భారత్ గెలుపును చూసింది. ఆ మధుర విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతం సీనియర్ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments