మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ పాక్ – తిప్పికొట్టిన భారత్

Saturday, March 9th, 2019, 06:43:44 PM IST

భారత సరిహద్దుల్లో పాక్ చేసే కవ్వింపు చర్యలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇటీవల పాక్ కి సంబందించిన ఒక డ్రోన్ భారత్ లోకి ప్రవేశించగా మన యవుసేన బలగాలు దాన్ని తిప్పికొట్టాయి… కాగా మరొక డ్రోన్ నేడు భారత్ సరిహద్దుల్ని దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. రాజస్థాన్ లోని హిందుమల్ కోట్ సమీపంలో ఉన్న శ్రీగంగానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన మన బీఎస్ఎఫ్ దళాలు అది పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ అని గమనించి వెంటనే భారీగా కాల్పులు జరిపారు బీఎస్ఎఫ్ జవాన్లు. కాగా ఆ డ్రోన్ కొద్దిలో తప్పించుకుని మళ్లీ పాక్ తిరిగి వెళ్లింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తమకు తుపాకీ కాల్పుల మోత వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు తెలిపారు. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ తమ అధికారుల దాటికి నిలవలేకపోయింది మన అధికారులు మీడియాకి వెల్లడించారు.