వరల్డ్ కప్ ఇండియాదే అంటోన్న గ్యారీ!

Friday, February 13th, 2015, 06:54:42 PM IST


ప్రపంచ కప్- 2015 క్రికెట్ పోటీలు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, భారత్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కప్ లు ఎలా గెలుచుకోవాలో ఇండియా నేర్చుకుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటతీరు పేలవంగా ఉన్నప్పటికీ గ్యారీ భారత జట్టుకు మద్దతుగా నిలిచాడు.

గ్యారీ ఇంకా మాట్లాడుతూ వరల్డ్ కప్ లో క్వార్టర్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు కీలకమని తెలిపాడు. అలాగే ప్రపంచ కప్ పోటీలలో భారత్ నాకౌట్ దశకు చేరుతుందని, ఆతర్వాత విజయాన్ని ఎలా చేజిక్కించుకోవాలో టీమిండియాకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు ఇక 2011లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ పోటీలలో ఇండియా టైటిల్ గెలుచుకోవడానికి అప్పటి టీమిండియా కోచ్ గా ఉన్నగ్యారీ పాత్ర కూడా ఎంతో కీలకమైనదన్న సంగతి తెలిసిందే.