అండర్‌-19 ట్రై సిరీస్‌ విజీత భారత్‌.

Saturday, July 13th, 2013, 11:01:39 AM IST

ధోనీ సేన విండీస్‌ గడ్డపై ముక్కోణపు టైటిల్‌ సాధించగా, కుర్రాళ్లు కంగారూ గడ్డపై అండర్‌-19 ముక్కోణపు సిరీస్‌ గెలిచారు.అండర్‌-19 ముక్కోణపు టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆసీస్ ను 8 వికెట్లతో తేడాతో చిత్తుచేసిన భారత్‌ టైటిల్‌ నెగ్గింది.టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 24.4 ఓవర్లలో 75 పరుగులకు అలౌట్‌ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి కంగారూ టీమ్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలింది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ షార్ట్‌ 25 పరుగులతో టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హుడా 3 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్‌, అభిమన్యు, కుల్‌దీప్‌యాదవ్‌ రెండేసి వికెట్లు తీశారు. గనీ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. 76 పరుగుల టార్గెట్‌ని యంగ్‌ ఇండియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేరుకుంది. బెయిన్స్‌ 40, శామ్సన్‌ 20 పరుగులతో రాణించారు.దీపక్‌ హుడాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ విజయ్‌ జోల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయ.