ముక్కోణపు సిరీస్ భారత్ కైవసం

Friday, July 12th, 2013, 03:41:47 AM IST


కరేబియన్ దీవుల్లో ఈ రోజు జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్ ఫైనల్స్ లో అమీతుమీ తేల్చుకోవడానికి ఇండియా – శ్రీలంక జట్లు గ్రౌండ్ లోకి దిగాయి. ఇప్పటికే పలుమార్లు ఇండియా చేతిలో ఫైనల్స్ లో ఓడిన శ్రీలంక జట్టు ఈ ఫనల్స్ గెలిచి ఇండియాకి షాక్ ఇవ్వాలని చూస్తుంటే, ఇండియా మాత్రం ఈ సారి కూడా శ్రీలంకకి ఓటమినే చూపి విశ్వవిజేతగానే కొనసాగాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే…

గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన ఇండియా టాస్ రూపంలో మొదటి విజయాన్ని అందుకుంది. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియాకి భారీ స్కోర్ లక్షంగా ఇవ్వాలని బరిలోకి దిగిన శ్రీలంక మొదటి నుంచి నిధానంగా పరుగులు చేయడం స్టార్ట్ చేసింది. ఇలా నిదానంగా మొదలు పెట్టిన శ్రీలంక టీం నిర్ణీత 48.5 ఓవర్లలో 201 ఆల్ అవుట్ అయ్యింది. శ్రీలంక నుంచి సంగక్కర 71 పరుగులు చేసాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన టీం ఇండియా మొదటి నుంచి దీటుగా దూకుడుతో ఆడుతూ శ్రీలంక బౌలర్స్ ని ఇబ్బందుల్లో పడేశారు. అలా దూకుడుగా ఆడిన ఇండియన్ టీం శ్రీ లంక ఇచ్చిన లక్ష్యాన్ని సాధించి ఫైనల్స్ లో విజయాన్ని సాధించి కరేబియన్ దీవుల్లో జరిగిన ముక్కోణపు సీరీస్ ని కైవసం చేసుకొని విశ్వవిజేత స్థానాన్ని పదిలం చేసింది. ఇండియా 49.4 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. ఇండియా టీం నుంచి రోహిత్ శర్మ 58 పరుగులు, ధోని 45 పరుగులతో మ్యాచ్ ని విజయపథంలో నడిపించారు.