రెండో వన్డేలో జింబాబ్వేపై భారత్ ఘన విజయం

Friday, July 26th, 2013, 08:30:28 PM IST

Indian-Cricket-Team
భారత్ – జింబాబ్వే మధ్య జరుగుతున్న వన్డే సీరీస్ లో భాగంగా భారత్ – జింబాబ్వే జట్లు ఈ రోజు రెండో వన్డే మ్యాచ్ కోసం తలపడ్డాయి. మొదటి వన్డే మ్యాచ్ గెలిచినా భారత్ అదే జోష్ తో బరిలోకి దిగుతుంటే జింబాబ్వే మాత్రం ఈ వన్డేలో భారత్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. అందులో భాగంగానే టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ని ఎంచుకుంది. దాంతో రంగంలోకి దిగిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడం మొదలు పెట్టింది. కేవలం 65 పరుగులకే కీలకమియన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు కోల్పోయినా ఓపెనర్ గా వచ్చినా శిఖర్ ధావన్ మాత్రం దీటుగా ఆది జింబాబ్వే బౌలర్స్ ని కట్టడి చేసాడు. ధావన్ కి తోడుగా కార్తీక్ నిలిచి భారత్ స్కోర్ ని భారీ దిశగా నడిపించారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసి 295 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. భారత్ జట్టులో శిఖర్ ధావన్ 116 పరుగులు చేయగా కార్తీక్ 69 పరుగులు చేసాడు.

అంత టార్గెట్ ని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ లోకి దిగిన జింబాబ్వే ఓపెనర్స్ మొదట్లో కాస్త దూకుడుగా ఆడినా ఆ తర్వాత భారత్ బౌలర్ల తాకిడికి తట్టుకోలేక వరుసగా వికెట్లను కోల్పోతూ బ్యాట్స్ మెన్స్ అందరూ వచ్చిన దారినే పెవిలియన్ బాట పట్టారు. దాంతో జింబాబ్వే భారత్ చేతిలో మరో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 236 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. దాంతో 5 వన్డేల సీరిస్ 2-0 గా నిలిచింది.