ఆంధ్రప్రదేశ్ ను వ్యూహాత్మక ఆధారంగా మలుచుకోనున్న భారత నావికా దళం..!

Sunday, September 16th, 2018, 07:21:12 PM IST


భారత నావికా దళం తూర్పు తీరం వెంబడి వారి తమ బలగాన్ని,వ్యూహాత్మక ఆధారాన్నిపెంపొందించుకొవడానికి కొన్ని వ్యూహాత్మక అడుగుగుల దిశగా వెళ్తుంది. అందులో భాగం గానే ఆంధ్ర రాష్ట్రం లోని కొన్ని ముఖ్య ప్రదేశాలను ఎన్నుకోబడింది. ప్రకాశం జిల్లా దానకొండ ప్రాంతం లోని భారత నావికా దళం హెలికాఫ్టర్ శిక్షణ కేంద్రంగా ఎన్నుకున్నట్టు తెలుస్తుంది.ఇందులో భాగం గానే దీని కన్నా ముందుగా నావికాదళంతో కలిసి ఆంధ్ర ప్రభుత్వం అనంతపురం లోని డ్రోన్ల తయారీ శిభిరాన్ని మరియు అమరావతి విజయవాడ మరియు రాజమండ్రి ప్రాంతాల్లో సైబర్ రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

“తూర్పు తీరం వెంబడి పెరుగుతున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను అనుసరించి చైనా దేశం వేగంగా అడుగులు వేస్తుంది అని అదే దిశలో భారత నావికా దళం కూడా తన ఉనికిని బలపరుస్తుంది. అలా బలపరిచానేదుకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ముఖ్య స్థావరాల్లో కూడా బలపరుస్తుంది”ప్రస్తుతం భారత నావికా దళం తమిళనాడు దగ్గరలో అరక్కోణం మరియు విశాఖ లోని ఐఎన్ఎస్ డేగ ప్రాంతాల్లో ప్రధాన ఆధారం ఉంది అని తెలుపుతుంది.

“ఈ ప్రాజెక్టు నిమిత్తం నావికా దకం ఒక జట్టుని ఆంధ్ర రాష్ట్రం లో ఏ ప్రదేశాలు ఐతే వారికి అనుగుణంగా ఉన్నాయో అన్న దాని కోసం ఒక విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది”
దీనిలో భాగంగా గత వారం నావికా దళ అధినేత మార్షల్ బి సురేష్ మరియు వారి బృందం ముఖ్యమంత్రితో ఏ ప్రదేశాలు ఐతే వారికి అనుగుణంగా ఉంటాయో అన్న దాని మీద కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ మహా ప్రాజెక్టుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2700 ఎకరాలను ప్రకటించినట్టు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments