క్విజ్ లో సత్తా చాటిన ఇండో అమెరికన్‌

Saturday, April 21st, 2018, 09:56:56 PM IST

దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అమెరికా క్వీజ్ పోటీలలో గెలిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ఇండియన్ ఎన్నారై ఆ కిక్ అందుకున్నాడు. అంతే కాకుండా భారీ ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. భారత సంతతికి చెందిన ధ్రువ్‌ గౌర్‌ అనే ఆ యువకుడు లక్ష డాలర్లను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ఐవీ లీగ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీలో ద్రువ్ చదువుతున్నాడు. జియోపార్డీ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో చాలా మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలివైన యువతి యువకులు ఆ పోటీల్లో వారి ప్రతిభను కనబరిచారు. అయితే వారందరికంటే ఎక్కువగా 600 స్కోర్ సాధించి ధ్రువ్ తన సత్తా చాటుకున్నాడు. వచ్చిన డబ్బుతో ఇంకా ఉన్నతమైన విద్యాబ్యాసం కోసం ఉపయోగించుకుంటానని ద్రువ్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments