అమెరికాలో దారుణం..ఇద్దరు ఎన్నారైలు హత్య..!

Friday, February 2nd, 2018, 10:33:54 AM IST

గత ఏడాది కాలంగా భారతీయులని కలవరపెట్టే ఘటనలు అమెరికాలో జరుగుతూనే ఉన్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. భారతీయ అమెరికన్లు అయిన తల్లి కొడుకులని దుండగులు దారుణంగా హత్య చేసారు. బుల్లెట్ల గాయాలతో 65 ఏళ్ల మన్వాని ఆమె కుమారుడు రిషి మన్వాని నిర్జీవులై వారినివాసంలోని పడి ఉన్నారు.

ఈ ఘటనలో స్థానిక పోలీస్ లు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలు జాతి విద్వేష ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీస్ లు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఈ హత్యలని జాతి విద్వేష హత్యలుగా తాము భావించడం లేదని పోలీస్ లు చెబుతున్నారు. మృతులు ఉంటున్న ఇంటిని, అపార్ట్మెంట్ ని పోలీస్ లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments