పాక్ పై పగ తీర్చుకున్న భారత్.. బార్డర్ లో హై అలెర్ట్!

Thursday, January 4th, 2018, 03:22:24 PM IST

కాలం ఎంత మారుతున్నా దాయాది దేశం పాకిస్తాన్ తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. గత కొంత కాలంగా ఆ దేశ ఆర్మీ కారణం లేకుండా ఇండియా సైనికులపై దాడి చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీ కూడా అందుకు గట్టిగా సమాధానం చెబుతూ వస్తోంది. అయితే ఎన్ని సార్లు ఈ తరహా ఘటనలు జరుగుతున్నా సరిహద్దుల్లో పాక్‌ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తోంది. అంతే కాకుండా చిన్నపాటి ఆయుధాలు అలాగే మోటార్‌ షెల్స్‌ దాడులతో భారత సైన్యాన్ని టార్గెట్ చేస్తోంది. ఇటీవల జరిపిన ఒక కాల్పుల్లో భారత బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్పీ హజ్రా చనిపోయాడు. ఘటన జరిగిన రోజే అతని పుట్టిన రోజు. అయితే చిక్కిత్స పొందుతూ అతను ప్రాణాలను విడిచాడు. అందుకు ప్రతీకారంగా భరత ఆర్మీ ప్రతికారంగా సరిహద్దులు ధాటి పాక్ పోస్టులను ద్వాంసం చేసింది. దాదాపు 15 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సమాచారం అందుతోంది. దీంతో సరిహద్దుల్లో భారత్ ఆర్మీ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇంకా అధికారికంగా ఆ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.