ఉగ్ర దాడి జరగబోతోంది జాగ్రత్త.. ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక

Wednesday, October 25th, 2017, 11:59:21 AM IST

కాలం ఎంత మారుతున్నా ఇంకా కొన్ని ఉగ్రవాద సంస్థలు మాత్రం వారి భయంకర ఆలోచనలను ఏ మాత్రం ఆపుకోవడం లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిర్ములనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయ్యాలని పిలుపుని ఇస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఉగ్రవాద కదలికలు భారత్ లో మొదలవుతున్నాయట. ఈ విషయాన్నీ చెప్పింది ఎవరో కాదు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌.

భారత్ లో భారీ ఉగ్రదాడి జరగబోతోందని బుధవారం ఆయన హెచ్చరికను జారీ చేశారు. గతంలో ఉరి ఘటన తరహాలోనే ఆ ఉగ్ర దాడి ఉంటుందని రక్షణ బలగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే దేశ సరిహద్దులో కూడా భద్రతను కట్టు దిట్టం చేయాలనీ చెబుతూ.. పశ్చిమ ఉత్తర సరిహద్దుల్లో కూడా నిఘా వ్యవస్థను బలపరచాలని రావత్ తెలిపారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ మొత్తం అన్ని రాష్ట్రాల రక్షణ శాఖలకు హెచ్చరికను జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఆర్మీ కి ఇలాంటి సమాచారమే అందింది. అయితే ఉరి ఘటన అనంతరం చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహాలోనే అవసరమైతే మరొకసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని ఇటీవల రావత్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments