సర్జికల్ స్ట్రైక్స్ : 38 మంది ఉగ్రవాదులు ఫినిష్..!

Friday, September 30th, 2016, 05:00:22 AM IST

dgmo1
భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాల పై జరిపిన లక్షిత దాడుల(సర్జికల్ స్ట్రైక్స్)ఫలితంగా 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇండియన్ ఆర్మీ అధికారిక సమాచారం ఇవ్వకపోయినా..విశ్వసనీయ సమాచారం ప్రకారం 38 మంది ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.ఇందులో 9 మంది పాక్ జవాన్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

నియంత్రణ రేఖ వెంబడి భారత సైనికులు పాక్ భూభాగం లోకి 3 కిలోమీటర్ల మేర చొరబడి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించారు.అర్ధరాత్రివేళ భారత సైనికులు హెలికాఫ్టర్ల ద్వారా తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్ల కంట పడకుండా పాక్ లోనికి ప్రవేశించి 7 ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేసినట్లు తెలుస్తోంది.దీనిఫలితంగా ఏక్షణానైనా ఏమైనా జరవవచ్చు అనే ఉద్దేశంతో బోర్డర్ లోని ప్రజలను తరలించాలని హోమ్ మంత్రి రాజ్ నాథ్ ఆయా సరిహద్దురాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు.దీనితో సరిహద్దు లో టెన్షన్ వాతావరణం నెలకొంది.