దేశంలోనే మొదటి ప్రైవేటు రైలు శకుంతల ఎక్స్ ప్రెస్.. మీరూ చూడండి…!!

Sunday, November 6th, 2016, 09:10:25 PM IST

train
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తనగా రైల్వే వ్యవస్థ మొత్తం ప్రభుత్వ హయాం లో ఉందనే మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ భారత్ లో ఒక ప్రాంతంలోని రైల్వే లైను మొత్తం ఒక ప్రైవేటు సంస్థ ఆదీనంలో ఉందనే విషయం మీకు తెలుసా…? అవును ఇది నిజం. గతంలో దేశానికి స్వాతంత్రం రాక ముందు రైల్వే వ్యవస్థ బ్రిటీష్ వారి ఆధ్వర్యంలో నడిచిన విషయం అందరికీ విదితమే. అయితే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో యావత్మాల్‌-ముర్తజాపూర్‌-అచల్‌పూర్‌ పట్టణాలను కలిపే నారోగేజ్‌ మార్గంలో తిరిగే ప్యాసింజరు రైలు. 190 కి.మీ. పొడవుండే ఈ మార్గం ‘శకుంతల రైల్వేస్‌’ ఆధీనంలో ఉంది.
దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు రైల్వే వ్యవస్థ ఇదే. అప్పట్లో విదర్భ ప్రాంత యువరాణి అయిన ‘శకుంతల’ మీదగా సంస్థకు ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పత్తి ని బాగే పండించేవారు. అయితే ఈ పత్తిని తమ దేశానికి తరలించాలనే ఉద్దేశంతోనే అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ని ఏర్పాటు చేసింది. ముంబయి-నాగ్‌పూర్‌-హౌరా రైలు మార్గంలో ముర్తజాపూర్‌ జంక్షన్‌ ఉంటుంది. పత్తిని మొదట ముర్తజాపూర్‌కి ఆపైన ముంబయికి అక్కణ్నుంచి సముద్రమార్గంలో ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేసేవారు.

  •  
  •  
  •  
  •  

Comments