షాకింగ్ న్యూస్ : హెచ్1బి వీసాలపై భారత కంపెనీల అయిష్టత?

Tuesday, April 3rd, 2018, 10:29:50 PM IST

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలలో భాగంగా, వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండడంతో భారత ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో వీసాలు అప్లికేషన్లు తగ్గించేశాయి. అమెరికా కంపెనీల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇప్పుడు విదేశీయులు ఇష్టపడడం లేదు. ఈ మేరకు అమెరికాలోని పలు ప్రముఖ పత్రికలు వీటిపై కథనాలను ప్రచురించాయి. ట్రంప్‌ యంత్రాంగం వీసాల జారీ విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిన తర్వాత భారత ఐటీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా హెచ్‌-1బీ వీసాలను పొందే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు సిలికాన్‌ వ్యాలీ న్యూస్‌ పేపర్‌ వెల్లడించింది. దీని ప్రభావం ఇటు హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు

వారికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలపైనా తీవ్రంగా పడింది. దరఖాస్తుదారులు గతంలో కంటే ఎక్కువగా ఈసారి నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని, దరఖాస్తులను సునిశితంగా పరిశీలిస్తామని అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) గట్టి సంకేతాలు ఇస్తోంది. వీటి ప్రభావం కంపెనీలు, దరఖాస్తుదారులపై ఎక్కువగా ఉందని తన కథనంలో వెల్లడించింది. భారత కంపెనీల నుంచి గతంలో ఎక్కువగా హెచ్‌-1బీ దరఖాస్తులు వచ్చేవి, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపింది. టేక్నాలజీ ఓరియెంటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎన్వాయ్‌ గ్లోబల్‌ సర్వే ప్రకారం కంపెనీల్లో పనిచేస్తున్న 26 శాతం మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రాజెక్టులను ఆలస్యంగా పూర్తి చేస్తున్నారు.

మరో 22 శాతం మంది ఉద్యోగులు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా హెచ్‌-1బీ వీసాల విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్‌ వెల్లడించింది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాగా పరిగణించే హెచ్‌1బీ వీసాతో అమెరికా కంపెనీలు విదేశీ కార్మికులకు ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఇస్తాయి. దీని ఆధారంగా టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా దేశాల నుంచి వందల, వేల మందిని ఉద్యోగాల్లో చేర్చుకుంటాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో… హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది….

  •  
  •  
  •  
  •  

Comments