ముక్కోణపు టోర్నీలో కీలక పోరుకి సిద్దమయిన భారత్

Tuesday, July 9th, 2013, 12:46:53 PM IST

సెల్‌కాన్ ముక్కోణపు టోర్నీలో భారత్ శ్రీలంకతో కీలక సమరానికి సిద్దమయ్యింది. తుది పోరుకు చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడనుంది . వెస్టిండీస్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో బారీ విజయం సాదించి బారత్ గాడిలో పడింది . మరోవైపు భారత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో బారీ విజయం సాదించిన శ్రీలంక ఆత్మవిస్వాసం తో ఉంది . అన్ని జట్లకు ఫైనల్ అవకాశాలు సమంగా ఉండడంతో తుది లీగ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ భారత్ ఓడితే ఫైనల్లో లంక, విండీస్ తలపడతాయి.ఈ కీలక మ్యాచ్‌లో భారత్‌కు అదృష్టం కుడా తోడవ్వాలి. వర్షం అడ్డుపడి మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న లంక ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. వరుణుడు అడ్డురాకుండా మ్యాచ్ సవ్యంగా పూర్తయితేనే టోర్నీలో కోహ్లీసేన తుది పోరుకి అర్హత సాదిస్తుంది .