ఆఫ్రిది కి కౌంటర్ ఇచ్చిన ఇండియన్ క్రికెటర్స్!

Wednesday, April 4th, 2018, 10:44:20 PM IST

భారతదేశంపై ప్రతిసారి లేనిపోని నిందలు వేయడంలో పాకిస్తాన్ ముందుంటుందని అందరికి తెలిసిన విషయమే. ఐక్యరాజ్య సమితి కోప్పడితే భారత్ వల్లే జరిగిందని చెప్పడం అలాగే వారి దేశంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా కూడా భారత్ వల్లే అని చెప్పడం సర్వసాధారణం అయిపొయింది. ఇండియా కూడా ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ.. పాకిస్థాన్ చేస్తోన్న విమర్శలకు కళ్లెం వేస్తోంది. అయితే క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కూడా ఇటీవల భారత్ ఫై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు భారత్ క్రికెటర్లు కూడా ఆఫ్రిదికి సరైన సమాధానం ఇచ్చారు.

గత కొన్ని రోజుల క్రితం భారత ఆర్మీ కాశ్మీర్ లో 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ విషయం గురించి ఆఫ్రిది మాట్లాడుతూ.. కాశ్మీర్ లో అమాయక ప్రజలను చంపుతోన్న భారత్ పై ఐక్యరాజ్య సమితి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశాడు. దీంతో వెంటనే గౌతమ్ గంబీర్ కౌంటర్ ఇచ్చాడు. నో బాల్ తో వికెట్ తీసి ఆనందపడుతున్నాడు. అతని వ్యాఖ్యలను పట్టించుకోవలసిన అవసరం లేదు. సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా అదే తరహాలో స్పందించాడు. ఇక విరాట్ కోహ్లీ ట్వీట్ చేస్తూ.. కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగమే పాకిస్తాన్ కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక రైనా – జడేజా కూడా వారి స్టైల్ ఆఫ్రిదికి కౌంటర్ ఇచ్చారు. హఫీజ్‌ సయిద్‌ ఒక ఉగ్రవాది అని ఐక్యరాజ్యసమితి తేల్చింది. అలాంటి వ్యక్తిని మీరు ప్రధాని చేయాలనీ అనుకున్నరని జడేజా తెలుపగా.. ఎప్పటికైనా కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని, అది మా పుర్వీకులు పుట్టిన పవిత్ర భూమి అని రైనా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు.