ఆర్మీ క్యాపుల్లో మెరిసిన భారత క్రికెటర్లు… అమరవీరులకు నివాళి

Friday, March 8th, 2019, 08:14:53 PM IST

నేడు రాంచి వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ లో మన క్రికెటర్లు సరికొత్తగా దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపోయేట్లు చేశారు… ‘మెన్ ఇన్ బ్లూ’ ఆర్మీక్యాప్ ‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. గత నెలలో జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడిలో అమరులైనటువంటి జవాన్లకు నివాళిగా నేడు మన క్రికెటర్లు ఆర్మీ క్యాప్స్ ధరించి తమ నివాళి అర్పించారు… పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఆర్మీ క్యాప్స్ ధరించి గ్రౌండ్ ‌లోకి దిగారు. ఇండియన్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో జట్టు సభ్యులకు టోపీలు అందజేశారు. ఈ మ్యాచ్ పూర్తయ్యే సరికి మన క్రికెటర్లు ఆర్మీ క్యాపుల్లోనే కనిపిస్తారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా వచ్చే తమ ఆదాయాన్ని సైనికుల సంక్షేమార్థం వారికీ విరాళంగా ఇవ్వనున్నట్లు కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు. మ్యాచ్ కామెంట్రేటర్లు కూడా భారత సైన్యం టోపీలను ధరించారు. మురళీ కార్తీక్, హేడెన్‌లకు సునీల్ గవాస్కర్ క్యాప్స్ అందజేశారు.

అంతేకాకుండా టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుజి కూడా గ్రౌండ్ లో కనిపించారు. నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గులాబీ రంగు బెలూన్లను ఎగురవేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు ఆమెనే టాస్ వేశారు కూడా.