ఫ్యాన్స్ రెస్పాన్స్ అదిరింది.. ఫుట్ బాల్ లో భారత్ గెలుపు!

Tuesday, June 5th, 2018, 10:27:33 AM IST

కనీసం మమ్మల్ని తిట్టడానికి అయినా రండి అంటూ భారత ఫుట్ బాల కెప్టెన్ అభిమానులను వేడుకోవడం ఇటీవల అందరి మనసులను కదిలించిన సంగతి తెలిసిందే. ఇండియాలో క్రికెట్ కు ఎక్కువ ఆదరణ ఉంది. కానీ మిగతా ఆటలకు ఆ స్థాయిలో అభిమానుల ఆదరణ లేదు. అందుకే కెప్టెన్ సునీల్‌ ఛెత్రి తన ఆవేదనను చెప్పుకున్నాడు. ఇక సునీల్‌ ఛెత్రి అలా చెప్పాడో లేదో అభిమానుల నుంచి ఊహించని ఆదరణ లభించింది.

సోమవారం కెన్యాతో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌ మ్యాచ్ లో భారత్ కు మద్దతుగా వేలాది అభిమానులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ముంబై లో మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులతో స్టేడియం ఒక్కసారిగా నిండిపోయింది. ఇక ఫ్యాన్స్ రాకతో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ సునీల్ ధాటికి కెన్యా తోక ముడిచింది. చివరి నిమిషం వరకు ఎంతో ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని (3-0) అందుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments