19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించాడు.. మన ఎన్నారై ఘనత

Tuesday, October 17th, 2017, 12:45:13 PM IST

ప్రస్తుత రోజుల్లో యువకులు చదువు అయిపోగానే ఎదో ఒక కంపెనీలో జాబ్ సంపాదించాలని అనుకోవడం లేదు. లైఫ్ లో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కుర్రకారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఒక 19 ఏళ్ల కుర్రాడు సాధించిన ఘనతను గురించి తెలిస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే.. పాతికేళ్లు కూడా లేని భారత సంతతికి చెందిన కుర్రాడు ఇప్పుడు బ్రిటన్ కోటీశ్వరుల జాబితాలో ఒకడిగా ఉన్నాడు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. భారతీయ సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా (19) స్కూల్ దశ నుండే బిజినెస్ లో లాజిక్స్ గురించి తెలుసుకున్నాడు. అదే విధంగా కలశాలకు వచ్చేసరికి వెబ్ సైట్స్ పై పట్టు సాధించాడు. ఈ క్రమంలో అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. వెబ్ సైట్ ద్వారా ఏ విధంగా లాభాలు పొందవచ్చనే క్రమంలో ఎవరు అంతగా ఉపయోగించని కాన్సెప్ట్ తో ‘డోర్‌ స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌ సైట్‌ ని స్టార్ట్ చేశాడు. యూకేలో జీవనాన్ని కొనసాగిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం కరెక్ట్ గా సేకరించి ఆ విషయాన్ని సైట్లో పోస్ట్ చేయడం అతని కాన్సెప్ట్. దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా అక్షయ్ తన బంధువుల దగ్గర నుంచి 7వేల డాలర్లను అప్పుగా తీసుకున్నాడు.

కాన్సెప్ట్ కొద్దీ రోజుల్లోనే క్లిక్ అవ్వడంతో అతని సైట్ కి చాలా మంచి గుర్తింపు దక్కింది. కేవలం 16 నెలలోనే 12 మిలియన్‌ పౌండ్ల బిజినెస్ కు చేర్చాడు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 6.02 లక్షలతో మొదలు పెట్టిన అతని వ్యాపారం ఇప్పుడు 100 కోట్లు దాటింది. ఇక ఈ బిజినెస్ బావుండడంతో మనోడు అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్య కోసం అవకాశం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటివరకు వెబ్ సైట్ ద్వారా 100 మిలియన్‌ పౌండ్ల (దాదాపు 860 కోట్ల రూపాయలు) స్థిరాస్తులను విక్రయించానని అక్షయ్‌ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments