వామ్మో.. బీజేపీకి వందల కోట్ల విరాళాలు..?

Thursday, May 31st, 2018, 08:48:11 AM IST

రాజకీయ పార్టీలను స్థాపిస్తే ఎంత డబ్బు పోతుందో తెలియదు గాని ఒక్కసారి క్లిక్ అయితే మాత్రం వందల కోట్లు వస్తాయని అంతా అనుకుంటారు. అది ఎలా వచ్చినా ఎవరు పట్టించుకోరు. ఇక మన దేశంలో పార్టీ ఫండ్ అనే ఒక రూపంలో నాయకులకు అందుతున్న డబ్బుల లెక్క అందరిని షాక్ కి గురి చేస్తోంది. వందల కోట్లు ధాటి వెయ్యి కోట్లకు దగ్గరగా వస్తోంది. పార్టీకి ఎక్కువగా ఇస్తోంది 20 వేల రుపాయాలే అయినా ఇంకా వేరే రూపంలో చాలా అందుతున్నాయని టాక్ వస్తోంది. ఆ సంగతి పక్కనపడితే.. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన లెక్కలను చూస్తే ఎవ్వరికైనా సరే దిమ్మ తీరుగుతుంది.

రూలింగ్ పార్టీ భారత జనతా పార్టీ కి వచ్చిన పార్టీ ఫండ్ రూ.515.43 కోట్లు. ఇంతవరకు ఏ పార్టీ అందుకొని విధంగా బీజేపీ గట్టి ఫండ్ ను అందుకుంది. ఇక మొత్తం 7 జాతీయ పార్టీలకు దాదాపు .710.80 కోట్లు విరాళాలు అందాయని ఏడీఆర్ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఇక దేశ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ సారి పార్టీ ఫండ్ లో బీజేపీ కి తగ్గట్టుగా పొందలేకపోయింది. ఆ పార్టీకి మొత్తంగా 160 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి అని తెలుస్తోంది. గుర్తు తెలియని వారు ఇచ్చిన సొమ్మే విరాళాల్లో ఎక్కువగా ఉంది. కార్పొరేట్ మరియు వ్యాపార రంగాల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందాయి. ఆ సైడ్ నుంచి బీజేపీకి రూ.515.43 కోట్లు. అందుకోగా కాంగ్రెస్ మాత్రం కేవలం రూ.36.06 కోట్లు మాత్రమే అందుకుంది. మిగతా పార్టీలు పదుల సంఖ్యలో కోట్లను విరాళాలాలుగా అందుకున్నాయి. ఈ లెక్క 2016 -17 లోది మాత్రమే. ఇంకా ఈ ఏడాది లెక్కలు ఓ కొలిక్కి రాలేదు. 2015 – 16 లో భాజపా కనీసం 100 కోట్ల విరాళాలు కూడా అందుకోలేదు. కానీ ఆ తరువాత ఎన్నికల్లో సక్సెస్ రేట్ పెరగడంతో ఫండ్ రెవెన్యూ కూడా పెరిగింది.

  •  
  •  
  •  
  •  

Comments