149 ఫోర్లు, 67 సిక్సర్లు.. బయపెట్టిన 13 ఏళ్ల తనిష్క్!

Wednesday, January 31st, 2018, 08:15:27 AM IST

ప్రస్తుత రోజుల్లో సీనియర్ క్రికెటర్స్ స్థాయిలో యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్ ఏదైనా మ్యాచ్ ఏ లెవెల్ డి అయినా బంతి ఎదురుగా వస్తే బౌండరీ దాటాల్సిందే అనేట్టుగా సత్తా చాటుతున్నారు. రీసెంట్ గా 13 ఏళ్ల ఆటగాడు చేసిన 1,045 రన్స్ క్రికెట్ చరిత్రలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరచింది. అధికారిక మ్యాచ్ అయ్యి ఉంటే సరికొత్త రికార్డు నమోదు అయ్యి ఉండేది. కానీ అది అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌.

కహిరానె- నవీ ముంబై జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 13 ఏళ్ల తనిష్క్ గవాటే 515 బంతుల్లో 149 ఫోర్లు, 67 సిక్సర్లతో మొత్తంగా 1,045 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ ను చుసిన క్రికెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ప్రత్యర్థి జట్టు బౌలర్లు అతని స్టామినాకు భయపడిపోయారు. ఇంతకుముందు కూడా కొన్ని టోర్నీలలో తనిష్క్ మంచి ఆట తీరుతో వందల పరుగులు చేశాడు. ఇలానే తన ఆటకు పదును పెడితే తనిష్క్ భవిష్యత్తులో ఇండియా జట్టుకు తప్పకుండా ఆడతాడని అతని సన్నిహితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.