థాయిలాండ్ రెస్క్యూ: ఆ ఆపరేషన్ లో భారత్ కూడా భాగమైంది!

Wednesday, July 11th, 2018, 04:46:03 PM IST

గత కొన్ని రోజులుగా థాయిలాండ్ కు సంబందించిన థామ్‌ లువాంగ్‌ గుహల గురించి అనేక వార్తలు టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి ఆ భయంకర గుహల నుంచి కోచ్ తో సహా 12 మంది పిల్లలని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మొదట్లో వారు బ్రతకడం కష్టమే అని అంతా భావించారు. మూడు నెలల సమయం పడుతుందని కూడా చెప్పడం భయాన్ని కలిగించింది. కానీ థాయ్ చిన్నారుల కోసం ప్రపంచం మొత్తం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

ఎలాగైనా వారు సురక్షితంగా రావాలని తమవంతు సహాయాన్ని అందిస్తామని కూడా తెలిపారు. ఎలన్‌ మస్క్‌ అనే పారిశ్రామిక శాస్త్రవేత్త ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని చిన్నారులను రక్షించడానికి తయారు చేయించి పంపగా, అమెరికా అధ్యక్షుడు కూడా తమవంతు సహాయం చేస్తాము అని ప్రకటించాడు. ఇక ఈ ఆపరేషన్ లో సాకర్ ప్లేయర్స్ ను రక్షించేందుకు భారత్ నుంచి కూడా సహాయం అందింది. థామ్‌ లువాంగ్‌ గుహలలో భారీ నీరు చేరకుండా నీళ్లను బయటకు పంపేందుకు ఇండియన్ టెకీలు ముఖ్య పాత్ర పోషించారు.

పుణెలోని కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌(కేబీఎల్‌)కు చెందిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాల్సిందిగా భారత రాయబార కార్యాలయం నుంచి థాయ్‌ అధికారులకు సమాచారం అందింది. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన కేబీఎల్‌ టెక్నీషియన్స్ థామ్‌ లువాంగ్‌కు చేరుకున్నారు. అక్కడ గుహల్లోని వర్షపు నీటిని ఎప్పటికప్పుడు పంపులతో బయటకు పంపేందుకు కృషిచేశారు. నీటి నిల్వ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని కేబీఎల్‌ టెక్నీషియన్స్ చేసిన సహాయానికి థాయ్ ప్రభుత్వ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments